Abn logo
Apr 11 2021 @ 00:04AM

కలర్‌ ఫ్యాషన్స్‌తో అవాక్కయ్యేలా...

విభిన్నమైన హెయిర్‌ కలర్స్‌తో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నారు అదాశర్మ. క్యూట్‌ లుక్స్‌తో కనిపించే ఆమె స్టైలింగ్‌లో చేసే ప్రయోగాలన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానుల్ని ఫిదా చేస్తుంటారు. ట్రెండీ దుస్తులు ధరించడమే కాదు. డిఫరెంట్‌ హెయిర్‌ కలర్స్‌తోనూ ఆకట్టుకుంటారు. మెరూన్‌, గులాబీ, నీలిరంగు, లైట్‌ ఎల్లో రంగులతో హెయిర్‌ స్టైలింగ్‌ చేస్తారు. ఇప్పుడు అలాంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘అదా ఇదేలా సాధ్యం’ అని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తే ఏదైనా కొత్తగానే ఉంటుంది’’ అని అదాశర్మ సమాధానమిచ్చారు. ప్రస్తుతం అదా పలు సిరీస్‌లతోపాటు ‘క్వశ్చన్‌ మార్క్‌’ సినిమాలో నటిస్తున్నారు.