Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 26 Feb 2022 21:14:37 IST

కుక్కకు స్వాగతం పలికేందుకు కాలనీ మొత్తం కదిలివచ్చింది.. కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు..

twitter-iconwatsapp-iconfb-icon
కుక్కకు స్వాగతం పలికేందుకు కాలనీ మొత్తం కదిలివచ్చింది.. కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు..

మనుషుల కంటే కుక్కలే నయం.. అని అప్పుడప్పుడూ పెద్దలు అంటుంటారు. ఒక్క పూట భోజనం పెట్టినా జీవితాంతం విశ్వాసం చూపిస్తాయి కాబట్టే.. వాటిని విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తుంటాం. అందుకే ధనవంతులు ప్రస్తుతం లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ జాతులకు చెందిన కుక్కలను కొంటూ ఉంటారు. కొందరైతే వాటిని సొంత పిల్లల మాదిరే చూసుకుంటూ ఉంటారు. వాటికి కాస్త ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు. ముంబైలో ఓ కాలనీవాసులంతా కలిసి కుక్కపై ఇలాంటి ప్రేమే చూపించారు. దానికి స్వాగతం పలికేందుకు కాలనీ... కాలనీ మొత్తం... తరలివచ్చింది! విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.

ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఓ సొసైటీ వారు ‘విస్కీ’ అనే వీధి కుక్కను పెంచుకునేవారు. కాలనీవాసులంతా దాన్ని ఎంతో ప్రేమతో చూసుకునేవారు. రోజూ ఒక్కొక్కరు చొప్పున దాని బాగోగులు చూసుకునేవారు. ఇదిలావుండగా ఇటీవల హఠాత్తుగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా అది దూరమవడాన్ని కాలనీవాసులు జీర్ణించుకోలేకపోయారు.  ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ రోజు స్థానికంగా ఉన్న ఓ మైదానంలో కనిపించింది. వెంటనే దాన్ని కారులో ఎక్కించుకుని మరీ కాలనీకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని కాలనీవాసులంతా దానికి స్వాగతం పలికేందుకు వచేశారు! మహిళలు హారతి పట్టి మరీ స్వాగతించారు. ఈ ఘటనను మొత్తం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుక్క పట్ల ప్రేమ కనబరచిన కాలనీవాసులను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video : అప్పటి వరకూ సిగ్గు పడిపోయిన పెళ్లికూతురు.. ఒక్కసారిగా అందరి ముందు ఇలా చేసిందేంటి..videoవేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్న భర్త.. ఆ వెంటనే తన ఛాతి మీద చేయి పెట్టుకున్నాడు.. తర్వాత ఊహించని విధంగా..హిజ్రాకు లింగమార్పిడి చేసేందుకు బీఫార్మసీ విద్యార్థుల ఒప్పందం.. గది అద్దెకు తీసుకుని మరీ ఆపరేషన్.. చివరకు.. కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయమంటే.. తల్లీ, కూతుళ్లకు నీళ్లిచ్చిన నకిలీ బాబా.. మరుక్షణమే..కాబోయే భర్తకు స్నేహితురాలితో కలిసి పరీక్ష పెట్టిన యువతి.. చివరకు భర్త చేసిన పనేంటో తెలుసుకుని ఖంగుతింది..నీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.