న్యూఢిల్లీ: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతేడాది తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.