కరోనా కాలంలో... భారీ టిప్... వెయిటర్ ఖుష్

ABN , First Publish Date - 2020-07-12T21:40:02+05:30 IST

అసలే కరోనా కష్టాలు. వ్యాపారాలు సరిగా నడవడం లేదు. ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితులు. అటువంటిది... తనకు ఏకంగా రూ. 70 వేల టిప్ దక్కడంతో... ఆ వెయిటర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలిలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని దేశాలు కూడా రెస్టారెంట్‌లు, పలు హోటళ్ళు మూతపడడంతో సిబ్బంది నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.

కరోనా కాలంలో... భారీ టిప్... వెయిటర్ ఖుష్

మిచిగాన్ : అసలే కరోనా కష్టాలు. వ్యాపారాలు సరిగా నడవడం లేదు. ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితులు. అటువంటిది... తనకు ఏకంగా రూ. 70 వేల టిప్ దక్కడంతో... ఆ వెయిటర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలిలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని దేశాల్లో... కూడా రెస్టారెంట్‌లు, పలు  హోటళ్ళు మూతపడడంతో సిబ్బంది నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.


కాగా... ఇటీవలి సడలింపులతో ఇప్పుడిప్పుడే అవి గాడిన పడుతున్నాయి. ఈ క్రమంలోనే వెయిటర్ పట్ల ఓ కస్టమర్... తన ఉదారత చూపించాడు. ఆ వెయిటర్ కు ఏకంగా  భారీ టిప్ ను అందించాడు. ఈ ఘటన అమెరికా లోని ది స్టార్వింగ్ అనే హోటల్ లో చోటుచేసుకుంది. ఓ రెగ్యులర్ కస్టమర్ ఇటీవలే తన ఫ్యామిలీ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్లాడు.


బిల్లు చెల్లించే సమయంలో... ఆ బిల్లు మొత్తం 43 డాలర్లతోపాటు టిప్పుె కింద ఏకంగా వెయ్యి డాలర్లు ఇచ్చాడు. దీంతో ఆ వెయిటర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

Updated Date - 2020-07-12T21:40:02+05:30 IST