Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఈ-వేలం’లో ఎస్‌బీఐ భారీ ఆఫర్...

హైదరాబాద్ : చౌక ధరకే ఇల్లు లేదా ఇతరత్రా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని ఎస్‌బీఐ కల్పిస్తోంది. ఎస్‌బీఐ ఈ క్రమంలో... మరోసారి ‘ఈ-వేలం’  నిర్వహిస్తోంది. అక్టోబరు  25 న ఈ-వేలం నిర్వహించనుంది. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌కు సంబంధించి ఈ వేలం ఉంటుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ  వివరాలను వెల్లడించింది.  తాకట్టులోని ఆస్తులను ఈ-ఎలక్ట్రానిక్ విధానంలో ఎస్‌బీఐ  వేలం వేయనుంది. తాకట్టులోని ప్రాపర్టీ వేలం కాబట్టి, మార్కెట్ ధర కంటే తక్కువకుకే ఇళ్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఎస్‌బీఐ  మెగా ఈ-ఆక్షన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 


Advertisement
Advertisement