నిర్దిష్ట భాగాలు లేకుండానే ... 95 వేల వాహనాల తయారీ

ABN , First Publish Date - 2022-07-02T02:20:02+05:30 IST

కంప్యూటర్ చిప్‌ల కొరత నేపథ్యంలో... General Motors రెండవ త్రైమాసికంలో నిర్దిష్ట భాగాలు లేకుండానే 95 వేల వాహనాలను నిర్మించాల్సి వచ్చింది.

నిర్దిష్ట భాగాలు లేకుండానే ...  95 వేల వాహనాల తయారీ

* General Motorsపై... ‘చిప్’ కొరత ప్రభావం

న్యూఢిల్లీ : కంప్యూటర్ చిప్‌ల కొరత నేపథ్యంలో... General Motors రెండవ త్రైమాసికంలో నిర్దిష్ట భాగాలు లేకుండానే 95 వేల వాహనాలను నిర్మించాల్సి  వచ్చింది. శుక్రవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మాట్లాడుతూ డెట్రాయిట్ ఆటోమేకర్ ... ‘అసంపూర్తిగా ఉన్న చాలా వాహనాలు జూన్‌లో తయారయ్యాయి. వీటిలో అధికభాగం... సంవత్సరం చివరిలోపు డీలర్లకు విక్రయిండం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


ఇక... అమ్మకం కాని వాహనాలు ఏప్రిల్-జూన్ కాలంలో GM మొత్తం అమ్మకాలలో 16% ఉన్నాయి. ఈ త్రైమాసికంలో 5.82 లక్షల వాహనాలను విక్రయించామని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 15శాతానికి పైగా తగ్గిందని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. కంపెనీ... రెండవ త్రైమాసికంలో ... $2.3-$2.6 బిలియన్లు(పన్నుల చెల్లింపులకు ముందు) ఆర్జించవచ్చని అంచనా వేసింది. చిప్ కొరత 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులను వేధిస్తోన్న విషయం తెలిసిందే. పలు కంపెనీలు... ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేసి ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది కూడా.


చిప్ కొరత కారణంగా అమెరికాలోని డీలర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొత్త వాహనాల సరఫరా  దాదాపు ఒక మిలియన్‌కే పరిమితమైన పరిస్థితి చోటుచేసుకుంది. సాధారణంగా ఏటా ఇది ఏ సమయంలోనైనా 4 మిలియన్లుగా ఉంటుంది. కాగా... చిప్ కొరత... ధరల పెరుగుదల విషయంలో కూడా తీవ్ర ప్రభావాన్నే చూపింది. గత సంవత్సరం మూడవ త్రైమాసికం నుండి ఉత్తర అమెరికా పరిధిలో ఉత్పత్తి స్థిరంగా ఉందని, అయితే స్వల్పకాలిక  అంతరాయాలు మాత్రం కొనసాగుతున్నాయని General Motors పేర్కొంది. ‘కస్టమర్ డిమాండ్‌ను తట్టుకునే క్రమంలో... మా సరఫరాదారులతో చురుకుగా వ్యవహరిస్తున్నాం’ అని ప్రకటన వివరించింది. ఇదిలా ఉంటే... ఫైలింగ్ తర్వాత శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో GM షేర్లు 2% పెరిగి, $32.42 కు చేరుకున్నాయి.

Updated Date - 2022-07-02T02:20:02+05:30 IST