Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 28 Oct 2021 23:26:27 IST

ఐపీఓ... ఖర్చు భారీగా... మరి లాభాలు ?

twitter-iconwatsapp-iconfb-icon
ఐపీఓ... ఖర్చు భారీగా... మరి లాభాలు ?

హైదరాబాద్ : ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టే పెద్ద పెట్టుబడిదారులు, సంస్థలు బ్యాంకుల నుంచి ఆ డబ్బును రుణంగా తీసుకుంటూండడం సాధారణంగా జరుగుతూంటుందన్న విషయం తెలిసిందే. లిస్టింగ్‌ గెయిన్స్‌తో వడ్డీతో సహా ఆ అప్పులు తీరుస్తేూండడం జరుగుతూంటుంది. కాగా... అటువంటి రుణాలపై  దాదాపు రెట్టింపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అంటే... ఖర్చు దాదాపు రెంట్టింపవుతోంది. గత రెండు నెలలుగా లిక్విడిటీ టైట్‌గా మారిన విషయం తెలిసిందే. రుణాల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో పోలిస్తే, మూలధన సేకరణ తగ్గింది. దీంతో వడ్డీ రేట్లు రెండు నెలల్లో 6-7 % నుంచి 12-13 % పెరిగాయి. రాబోయే రెండు వారాల్లో డజను ఐపీఓలు మార్కెట్‌లోకి రానున్నాయి. కాగా... వీటిలో పెట్టుబడులకు సంబంధించి ెట్టుబడిదారులకు భారీగా నిధులు అవసరమవుతాయి. ఈ నేపధ్యంలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.


ఈ రోజు(గురువారం) నుంచి నవంబరు 3 మధ్య ఐదు ఐపీవోలు మార్కెట్‌లోకి రానున్నాయి. లిస్టింగ్ గెయిన్స్‌ కోసం వీటిలో పెట్టుబడులు  పెట్టేందుకుగాను సంపన్న పెట్టుబడిదారులు వారి బ్రోకర్ల ఫైనాన్స్ ఆర్మ్‌ నుంచి రుణం తీసుకుంటారు. ఫండింగ్ రేట్లు పెరగడంతో, సంపన్న పెట్టుబడిదారులు ఒక్కో షేరుపై పెట్టే పెట్టుబడి వ్యయం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ తరహా డిమాండ్ ఎక్కువగా ఉంది, మూలధన సేకరణ సామర్థ్యం తక్కువగా ఉంది. అందువల్ల ఫండింగ్‌ రేటు గణనీయంగా పెరిగి 10-12 % మధ్య ఉంటుందని అని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ పేర్కొంటోంది. ఉదాహరణకు... ఏడు రోజులకు 7 % వడ్డీ చొప్పున... నైకా ఒక్కో షేరు ఖర్చు 100 రెట్ల హెచ్‌‌ఎన్‌ఐ ల సబ్‌స్క్రిప్షన్‌కు దాదాపు రూ. 151 అవుతుంది. అంటే... 11 % వద్ద ఖర్చు ఒక్కో షేరుకు రూ. 237 కు పెరుగుతుంది. అంటే... 13 % వద్ద ఖర్చు రూ. 280 అవుతుంది. 


మరింత వివరంగా చెప్పాలంటే... 13 % వడ్డీకి రుణం తీసుకుంటే, నైకా... ఒక్కో షేరుకు రూ. 280 కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్ట్‌ అయితేనే పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశముంటుంది. నైకా వంటి ఐపీవోలు హెచ్‌ఎన్‌ఐ పోర్షన్‌లో 100 రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను చూసే అవకాశముందని, ఈ క్రమంలో... 12 % అధిక రేటు వద్ద కూడా ఈ తరహా ఐపీవోల్లో పెట్టుబడిదారులు బాగానే లాభం సంపాదించవచ్చని ఐఐఎఫ్‌ఎల్ వెల్లడించింది.


నైకా, పాలసీ బజార్ ఐపీవోలు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో రూ. 670, రూ. 220 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. నైకా ఐపీవో రూ. 5,352 కోట్ల సేకరణ లక్ష్యంో ఈ రోజు(గురువారం) ప్రారంభం కాగా, పాలసీ బజార్ ఐపీవో సోమవారం రూ. 5,710 కోట్ల సేకరణ లక్ష్యంతో ప్రారంభం కానుంది. మార్కెట్ వర్గాల ప్రకారం... ఈ రెండు ఐపీవోలకు హెచ్‌ఎన్‌ఐల నుంచి దాదాపు రూ. లక్ష కోట్ల రుణాల డిమాండ్ ఉంది. కాగా...  లభ్యత మాత్రం... రూ. 50,000-రూ. 60,000 కోట్ల మధ్య ఉంది.


చాలాకాలం తర్వాత భారీ డిమాండ్ కారణంగా ఐపీవో ఫండింగ్ రేట్లు 12-13 % కు చేరాయని కేఆర్‌ఐఎస్ రీసెర్చ్ & అడ్వైజరీ సంస్థ వెల్లడించింది. నైకా, పాలసీ బజార్ బ్యాక్-టు-బ్యాక్ ఐపీవోలకు ఫండింగ్‌ విషయంలో హెచ్‌ఎన్‌ఐలు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. దాదాపుగా 60:40 నిష్పత్తిలో వీటికి నిధులు పంపిణీ అవుతాయని చెబుతున్నారు. పరాస్ డిఫెన్స్, అమీ ఆర్గానిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, రోలెక్స్ రింగ్స్, తత్వ చింతన్, జొమాటో, క్లీన్ సైన్స్, జీఆర్ ఇన్‌ఫ్రా ఐపీవోల సమయంలో వడ్డీ రేటు 6-7 శాతానికి దిగి వచ్చింది. దీంతో... హెచ్‌ఎన్‌ఐలు దూకుడుగా రుణాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే... కొత్త నిబంధనల నేపధ్యంలో... ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టేవారికి... వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు రూ. కోటి కంటే ఎక్కువరుణాలనివ్వలేవు. ఇక నవంబరు 4, 5 తేదీల్లో బ్యాంకులకు దీపావళికి సెలవుల నేపధ్యంలో నైకా ఐపీఓ కోసం బ్యాంక్‌ ఖాతాల్లో బ్లాక్ అయిన డబ్బు నవంబరు 8, సోమవారం మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.