Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెంగాళమ్మను సందర్శించిన కలెక్టర్‌

సూళ్లూరుపేట, డిసెంబరు 5 : కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు  ఆదివారం కుటుంబసమేతంగా  చెంగాళమ్మ ఆలయాన్ని, పులికాట్‌ సరస్సును సందర్శించారు. ముందుగా పులికాట్‌ సరస్సుకు వెళ్లి పక్షులను తిలకించారు. అనంతరం చెంగాళమ్మ ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులతో  ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్‌తోపాటు సూళ్లూరుపేట తహసీల్దారు రవికుమార్‌, పాలకమండలి సభ్యులు గోగుల తిరుపాల్‌, ముంగర అమరావతి తదితరులు పాల్గొన్నారు. Advertisement
Advertisement