కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-07-28T06:22:56+05:30 IST

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కిసాన్‌ మోర్చా చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది.

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కిసాన్‌ మోర్చా నాయకులు

భువనగిరి రూరల్‌, జూలై 27: రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కిసాన్‌ మోర్చా చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్య తిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన బారీకేడ్లను కార్యకర్తలు బలవంతంగా ముందుకు నెట్టివేశారు. పోలీసులు బారీకేడ్‌ను బలవంతంగా నెట్టడంతో కిసాన్‌మోర్చా రాష్ట్రఅధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డికి చేతికి గాయాలయ్యాయి. ఆయనను పోలీసులు వాహనం లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న ప్రభు త్వం ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడంలేదన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల బీమా కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ డం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు నిరంజన్‌రెడ్డి, బొట్టు అబ్బయ్య, పట్నం శ్రీనివాస్‌, జి. సత్యనారాయణ, మొగులయ్య, నర్సింగరావు, పీఎస్‌ రమేష్‌, పురుషోత్తంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మల్లేశం, శ్రీనివాస్‌, పాదరాజు, ఉమాశంకర్‌, పట్నం కపిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T06:22:56+05:30 IST