Abn logo
Sep 27 2021 @ 00:15AM

కలెక్టరేట్‌ స్పందన నేడు రద్దు

తుఫాన్‌ నేపథ్యంలో సహాయక విధుల్లోకి అధికారులు

కార్యాలయానికి రావద్దని అర్జీదారులకు సూచన

విశాఖపట్నం, సెప్టెంబరు 26: కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమం తుఫాన్‌ వర్షాల కారణంగా సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాన్‌ సహాయక విధుల్లో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉన్నందున హాజరు సాధ్యం కాదని, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టర్‌ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.