గుండెగాం గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్
భైంసా రూరల్, జూన్ 30 : భైంసా మండల శివారులో రెండు పడకల గదుల ఇళ్ల సముదాయాన్ని జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పరిశీలించారు. అక్కడ ఉన్న గుండెగాం గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నా కొత్తగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చేపట్టమని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో భైంసా లోకేష్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.