వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేస్తున కలెక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లిటౌన్, జనవరి 21 : పట్టణంలోని 14వ వార్డులో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ సంగీత సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ప్రక్రియ ఎలా సాగుతోందని అడిగి తెలసుకున్నారు. అంద రు వ్యాక్సినేషన్ వేసుకునేలా ప్రొత్సహించాలన్నారు. ఎవరికైనా సందేహాలుంటే నివృ త్తి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో షాహెద సబీర్‌ఖాన్, సరిత, సుజారాణి, నాగమణి, తదితరులున్నారు.