‘పది’ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-26T05:16:22+05:30 IST

నాగర్‌కర్నూ ల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన సాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు.

‘పది’ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూ ల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన సాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశి తంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలె క్టర్‌ ఆరా చేశారు. బుధవారం నాటి ఇంగ్లీష్‌ సబ్జెక్టు ప రీక్ష సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సీసీ ఫుటేజీని పరిశీలిస్తూ, ప్రశ్నపత్రాల బండిళ్లను నిర్ణీత సమయానికి తెరిచారా, నిబంధనలను పాటించా రా లేదా అన్న అంశాలను గమనించారు. సీసీ కెమెరా లో లోపాలు లేకుండా వాటిని సరి చేసుకోవాలని ని ర్వాహకులు సూచించారు. అన్ని సదుపాయాలను అం దుబాటులో ఉంచుతూ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహి స్తుండడంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాల్లో 11060 మంది విద్యార్థు లకుగాను 10928 మంది హాజరు కాగా, 132 మంది గైర్హాజరయ్యారని, 98.80 శాతం హాజరు శాతం నమో దైందని డీఈవో గోవిందరాజులు తెలిపారు. 


జోగుళాంబ సన్నిధిలో కలెక్టర్‌

అలంపూరు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠ మైన అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం కలెక్టర్‌ పీ ఉదయ్‌కుమార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముం దు వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దంపతులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుం కుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంత రం వారికి ఆలయాల విశిష్ఠతలను వివరించారు. వారి వెంట ఈవో పురేందర్‌కుమార్‌, చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు.


విద్యలో సాంకేతికతను సాధించాలి

కల్వకుర్తి: విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువు లో సాంకేతికతను అందిపుచ్చుకుని రాణించాలని కలె క్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ సూచించారు. కల్వకుర్తి పట్టణం లోని ఆశ్రమ పాఠశాలలో 5,6,7 తరగతి ప్రభుత్వ పా ఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా తర గతులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో ఉన్న భయాలను తొలగించుకోవ డానికి శిక్షణ తరగతులు దోహదపడుతాయన్నారు. వి ద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాకారం చే సుకోవాలని కోరారు. డీఈవో గోవిందరాజులు, ఐటీడీఏ పీవో అశోక్‌, సెక్టోరల్‌ అధికారి వెంకటయ్య, ఎంఈవో బాసునాయక్‌, ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, వందేమాతరం ఫౌండేషన్‌ కార్యదర్శి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:16:22+05:30 IST