Abn logo
Aug 3 2021 @ 22:48PM

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్‌

పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

మందమర్రి, ఆగస్టు 3: బొక్కలగుట్ట పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను కలెక్టర్‌ భారతి హోళికేరి మంగళవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఫిట్టింగ్‌, ప్లాంటింగ్‌, ట్రెంచ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారు లకు సూచించారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, పం చాయతీ అధికారి ఆలీ, సర్పంచ్‌ సువర్ణ  ఉన్నారు.

 జైపూర్‌ : మొక్కల పెంపకంలో అలసత్వం ప్రదర్శించవద్దని ఎంపీడీవో కే.నాగేశ్వర్‌రెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం పలు గ్రామాల్లో చేపట్టిన  పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీరందించాలన్నారు. పంచాయతీ అధికారి సతీష్‌కుమార్‌, ఉపాధి హామీ అధికారి బాలయ్య, సర్పంచులు ఉన్నారు. 

కోటపల్లి: లింగన్నపేట, ఏదులబంధం, రొయ్య లపల్లి, ఆల్గామ, సిర్సా, పుల్లగామ, జనగామ, వెంచ పల్లి గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను ఏపీడీ మ ల్లేష్‌ పరిశీలించారు. మొక్కల రకాలు తెలుసుకొని సిబ్బందికి సూచనలు చేశారు. ఏపీవో వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.