మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T05:12:59+05:30 IST

గుంటూరులోని పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మువ్వన్నెల రెపరెపలు
గౌరవ వందన స్వీకరిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

ఘనంగా గణతంత్ర వేడుకలు 

ప్రతిభా పురస్కారాల ప్రదానం 

ఆకట్టుకొన్న శకటాల ప్రదర్శన

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు 

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గుంటూరులోని పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వివిధ జిల్లా శాఖలు ప్రదర్శించిన శకటాలు వీక్షకులను ఆకట్టుకొన్నాయి. పోలీసు జాగిలాలు పరేడ్‌ నిర్వహించడంతో పాటు జిల్లా అధికారులకు వందనం చేశాయి. శకటాల ప్రదర్శనలో జడ్పీ శకటానికి ప్రథమ, విద్యా శాఖకు ద్వితీయ, డ్వామాకి తృతీయ బహుమతులను కలెక్టర్‌ ప్రదానం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటాయి. ఈ ప్రదర్శనల్లో విజ్ఞాన్‌ ఉన్నత పాఠశాలకు ప్రథమ, ఏఎంజీ హైస్కూల్‌కి ద్వితీయ, కేఎల్‌పీ పబ్లిక్‌ స్కూల్‌కి తృతీయ బహుమతులను అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు సందర్శించారు. డీఆర్‌డీఏ వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం ద్వారా 4,117 డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజ్‌ ద్వారా రూ.463.34 కోట్లని ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిష్టిన, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీన, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, తూర్పు తహసీల్దార్‌ శ్రీకాంత్‌, పశ్చిమ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


పోలీసు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, విశాల్‌గున్నీలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి రిపబ్లిక్‌ డే స్ఫూర్తితో పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత బాధ్యతగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతోపాటు ఆయా కార్యాలయాల మినిస్ర్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రతిభకు ప్రశంస

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు జిల్లాస్థాయి అధికారులు, వివిధ శాఖల్లో ఉద్యోగులు, ఎన్‌జీవోలకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి అధికారుల్లో డాక్టర్‌ నిధి మీన(తెనాలి సబ్‌ కలెక్టర్‌), పి.కొండయ్య(డీఆర్‌వో), ఎస్‌.భాస్కర్‌రెడ్డి(గుంటూరు ఆర్‌డీవో), టి. భాస్కర్‌నాయుడు(డిప్యూటీ కలెక్టర్‌, కేఆర్‌ఆర్‌సీ), ఎన్‌.శ్రీనివాసులు(ఎస్‌ఈ, పబ్లిక్‌హెల్త్‌), జి.బ్రహ్మయ్య(ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌), జి.శ్రీనివాసరావు(డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌), డాక్టర్‌ జె.హన్మంతరావు(జిల్లా కోఆర్డినేటర్‌, హాస్పిటల్‌ సర్వీసెస్‌), ఎస్‌.పద్మశ్రీ(డీఎస్‌వో), ఆర్‌ఎస్‌ గంగాభవాని(డీఈవో), ఎం.సుధాకర్‌రెడ్డి(డీసీ, ఎక్సైజ్‌), ఎన్‌.రామచంద్రరావు(డీఎప్‌వో, టెరిటోరియల్‌), కె.బసవయ్య(పీడీ, హౌసింగ్‌), డాక్టర్‌ జె.యాస్మిన్‌(డీఎంహెచ్‌వో), కేఆర్‌డీ కార్తీక్‌(డీడీ, నాబార్డు), ఆర్‌.కేశవరెడ్డి(డీపీవో), బి.మనోరంజని(పీడీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ), ఈ.రాంబాబు(ఎల్‌డీఎం), ఏ శ్రీనివాసరావు(ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ) ప్రశంసాపత్రాలు అందుకొన్నారు. ఎన్‌జీవోల నుంచి వారధి ఫౌండేషన్‌(గుంటూరు), ఎం.విజయలక్ష్మి(కీర్తన ట్రస్టు, గుంటూరు), డేవిడ్‌ జోసఫ్‌(ది న్యూలైఫ్‌ ఇండియా, గుంటూరు), గూడవల్లి గంగాధరరావు(పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ), హార్వెస్టు ఇంండియా(కత్తెర సురేష్‌కుమార్‌, తెనాలి), కత్తెర డేవిడ్‌ యశ్వంత్‌(మదర్స్‌ టచ్‌ ఛారిటీ ఫౌండేషన్‌, తెనాలి), టీవీ కృష్ణ సుబ్బారావు(శిల్పి, శ్రీరామ్‌నగర్‌, గుంటూరు), సముద్రాల చినకోటేశ్వరరావు(స్టూడెంట్‌ ఫర్‌ పూర్‌ పీపుల్‌, బృందావన్‌గార్డెన్స్‌), జేఎంజే సోషల్‌ సర్వీసు సొసైటీ, నల్లపాడు, ఎన్‌ఎల్‌బీ త్రిపురసుందరి(స్టాఫ్‌నర్స్‌, పీహెచ్‌సీ వినుకొండ), ఎం.శ్రీనివాసరావు ఉన్నారు. మెస్సర్స్‌ శ్రీనివాస ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నరసరావుపేటకు కూడా ప్రశంసా పత్రాన్ని కలెక్టర్‌ అందజేశారు. 



Updated Date - 2022-01-27T05:12:59+05:30 IST