జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు

ABN , First Publish Date - 2022-01-29T05:59:13+05:30 IST

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు
జంగారెడ్డిగూడెంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

జంగారెడ్డిగూడెం, జనవరి 28: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ఆయన శుక్రవారం జంగా రెడ్డిగూడెంలో పర్యటించారు. సచివాలయ రికార్డులు, మార్కెండేయపురంలో నిర్మాణంలో ఉన్న టిడ్‌కో ఇళ్లను, జగనన్న లేఅవుట్‌ స్థలాలను పరిశీలించారు. నిర్మాణంలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ జంగారెడ్డిగూడెంలో 5 లేఅవుట్‌లలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.50లక్షలు మంజూరయ్యాయని, టెండర్లు ముగియగానే పనులు జరుగు తాయన్నారు. లబ్ధిదారులు ఇళ్లను వేగంగా నిర్మించుకుంటే మంచి పార్కు, అంగన్‌వాడీ సెంటర్‌, సచివాలయంను ఏర్పాటు చేసి ఒక వార్డుగా తయారు చేస్తామన్నారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రావన్‌కుమార్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, హౌసింగ్‌ పీడీ టి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


కేఆర్‌.పురం బాలుర పాఠశాల సందర్శన


బుట్టాయగూడెం, జనవరి 28: కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ శుక్రవారం రాత్రి కేఆర్‌.పురం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించారు.  విద్యాబోధన, వసతి సౌకర్యం, కొవిడ్‌ నివారణ చర్యలు, వైద్య సదుపాయం తదితర అంశాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. వసతిగృహంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమం లో ట్రైనీ కలెక్టర్‌ రాహూల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో వైవీ.ప్రసన్నలక్ష్మి, ఏపీవో సీహెచ్‌.శ్రీనివాసరావు, డీడీ పి.వెంకటేశ్వరావు, తహసీల్దార్‌ వైవి.లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:59:13+05:30 IST