హరితహారం విజయవంతానికి ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2021-06-17T05:27:36+05:30 IST

జిల్లాలో 7వ విడత హరితహారం విజయవంతానికి పక్కా ప్రణాళిక సిద్దం చేశామని, జిల్లాలో 1.05కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా నిర్దారించి, శాఖలవారిగా లక్ష్యాన్ని కేటాయిం చినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు.

హరితహారం విజయవంతానికి ప్రణాళిక సిద్ధం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 16:  జిల్లాలో 7వ విడత హరితహారం విజయవంతానికి పక్కా ప్రణాళిక  సిద్దం చేశామని, జిల్లాలో 1.05కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా నిర్దారించి, శాఖలవారిగా లక్ష్యాన్ని కేటాయిం చినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు నిర్వహించిన కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్‌ అనుదీప్‌ పాల్గొని జిల్లా ప్రణాళికను వివరించారు. 481 గ్రామ పంచాయితీల్లో 90,29,211, నాలుగు మున్సిపాల్టీల్లో 14,68,017 మొక్కలు నాటేందుకు శాఖల వారిగా లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు  వివరించారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటిని గుర్తించి తిరిగి వాటి స్థానే కొత్తమొక్కలు నాటేందుకు చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలకు ప్రహారిగోడలకు బదులుగా బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి కార్యాలయాలను పరిశుభ్రం చేయడం, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. నర్సరీలు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు, పబ్లిక్‌ టాయిలెట్లు, వైకుంఠ ధామాలు సహా అన్ని అం శాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి సమగ్ర నివేధికలు అందజేయాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.  డీపీవో, డివిజనల్‌ పంచాయితీ అధికారులు, ఎం పీడీవోలు క్షేత్రస్థాయిలో  పర్యటనలు చేసి పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను పర్యవేక్షించే లా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు పాల్వంచ మం డలం లక్ష్మిదేవిపల్లి  గ్రామంలో స్థలం కేటాయింపు చేయడంతో పాటు నివేదికలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ సీజనల్‌లో అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సే కరణ చేపట్టి వర్మికంపోస్టు తయారికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్‌, డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తి, డీఆర్‌డీవో మధుసూధన్‌రాజు, డీపీవో రమాకాంత్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T05:27:36+05:30 IST