మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

ABN , First Publish Date - 2021-02-26T07:10:26+05:30 IST

జిల్లాను మాదక ద్రవ్య రహితంగా చేసేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపు నిచ్చారు.

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
జీఈసీలో జరిగిన అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 25 :  జిల్లాను మాదక ద్రవ్య రహితంగా చేసేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపు నిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి విలువైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగి అనర్థాలను అధ్యాపకులు, తలి దండ్రులు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ జిల్లా ప్రచార కమిటీ ఆద్వర్యంలో   ‘మత్తు పదార్థాల వాడకం - దృష్ఫలితాలు’ అంశంపై జరిగిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా  పాల్గొని ప్రసంగించారు.  యువతలో మాదకద్రవ్యాల అలవాటును రూపు మాపేందుకు విస్తృత అవగాహనా కార్యక్రమాలను చేపట్టామన్నారు.  డ్రగ్స్‌ హాట్‌స్పాట్లను ఇప్పటికే గుర్తించామన్నారు. నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ జిల్లా ప్రచార కమిటీ రూపొందించిన  రూపకాన్ని,  లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కలెక్టర్‌ను కళాశాల యాజమాన్య ఎడ్వైజ్‌ డాక్టర్‌ పొట్లూరి రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.ఎస్‌..ఎన్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ సన్మానించారు. నారాయణరావు, తహసీల్దార్‌ ఆంజనేయిలు,  వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.కోదండరామారావు, డాక్టర్‌ ఎం.ఆర్‌.సిహెచ్‌.శాస్ర్తి  తదితరులు పాల్గొన్నారు.

 గ్రామ సచివాలయాల తనిఖీ

 అర్హులైన లబ్ధిదారులకు పథకాలను సక్రమంగా అందజేయాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ సిబ్బందిదేనని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. మండలంలో కౌతవరం, గుడ్లవల్లేరు సచివాలయాలను గురువారం ఆయన తనిఖీ చేశారు.  రిజిస్టర్లను, కంప్యూర్‌లో డేటాను  పరిశీలించారు.  ఏమైనా సమస్యలు ఉన్నాయా అని  డిజిటిల్‌ అసిస్టెంట్‌ను ప్రశ్నించగా,  తమకు   శాఖాపర మైన అంశాలే కాకుండా,  ఇతర డేటా కూడా చేయించడంతో పనిభారం ఎక్కువగా ఉందని చెప్పడంతో పరిశీలిస్తానని కలెక్టర్‌ అన్నారు. 

Updated Date - 2021-02-26T07:10:26+05:30 IST