వీసీకి హాజరైన కలెక్టర్‌, ఎస్పీ

ABN , First Publish Date - 2022-08-10T06:08:58+05:30 IST

ప్రణాళికబద్దంగా వజ్రోత్సవాల నిర్వహణ జరపాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సంబందిత అధికారులను ఆదేశించారు

వీసీకి హాజరైన కలెక్టర్‌, ఎస్పీ

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవాల నిర్వహణ

 వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

జగిత్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రణాళికబద్దంగా వజ్రోత్సవాల నిర్వహణ జరపాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సంబందిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వా రా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 16వ తేది ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపాన జరపాలన్నారు. ప్రతీ గ్రామంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలన్నారు. ఫ్రీడం కప్‌ కింద గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలను నిర్వహించాలన్నారు. ఫ్రీడం రన్‌, ర్యాలీ, సామూహిక జాతీయ గీతాలాపాలనలో పోలీసు శా ఖ కీలక పాత్ర వహించాలన్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వి విధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు సంబందిత సమాచారంతో నివేధికలు పంపాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, ఎస్పీ సింధూ శర్మ, అదనపు కలె క్టర్లు బీఎస్‌ లత, అరుణ శ్రీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:08:58+05:30 IST