ఏపీఎంఐపీ పీడీ మృతిపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2021-05-17T06:36:45+05:30 IST

ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు మృతిపై జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సీరియస్‌ అయ్యారు. సుబ్బరాయుడుకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులు సుధాకర్‌, శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేవారు.

ఏపీఎంఐపీ పీడీ మృతిపై కలెక్టర్‌ సీరియస్‌

ఇద్దరు వైద్యుల సస్పెన్షన..

సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, 

ఇద్దరు హెడ్‌ నర్సులకు షోకాజ్‌ నోటీసులు


అనంతపురం, మే16(ఆంధ్రజ్యోతి): ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు మృతిపై జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సీరియస్‌ అయ్యారు. సుబ్బరాయుడుకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులు సుధాకర్‌, శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేవారు. పనిచేయని ఆక్సిజన ఫ్లో మీటర్లు మార్చకపోవడం, స్ర్టెచర్‌ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. పనిచేయని ఆక్సిజన ఫ్లో మీటర్ల స్థానంలో కొత్తవి అమర్చడంలో  ఎందుకు విఫలమయ్యారో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌, హెడ్‌నర్సులు మహాలక్ష్మి, రాజేశ్వరికి షోకాజ్‌ నోటీసులిచ్చారు.


హిందూపురం మున్సిపాలిటీలో ఇద్దరు..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన హిందూపురం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అధికారులను కలెక్టర్‌ గంధం చంద్రుడు సస్పెండ్‌ చేశారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన వినియోగం పర్యవేక్షణకు వార్డు కో-ఆర్డినేటింగ్‌ అసిస్టెంట్‌గా నియమించిన 24వ వార్డు ఉమెన ప్రొటెక్షన సెక్రటరీ అనూష ఆస్పత్రిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఉన్నతాదికారుల ఆదేశాలను ఖాతరు చేయడం లేదని మున్సిపల్‌ కమిషనర్‌ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సివిల్‌ సర్వీసె్‌స (సీసీఏ) రూల్స్‌ ప్రకారం అనూష సస్పెన్షనకు కలెక్టర్‌ ఆమోదించారు. ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన వినియోగం పర్యవేక్షణకు వార్డు కో-ఆర్డినేటింగ్‌ అసిస్టెంట్‌గా నియమించిన 3వ వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ హర్షవర్దనరెడ్డిని సివిల్‌ సర్వీసె్‌స (సీసీఏ) రూల్స్‌ ప్రకారం సస్పెండ్‌ చేసినట్లు రీజినల్‌ డైరెక్టర్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Updated Date - 2021-05-17T06:36:45+05:30 IST