అంగన్‌వాడీ కేంద్రాలు కాదు..వైఎస్సార్‌ ప్రీ స్కూల్స్‌

ABN , First Publish Date - 2022-08-17T06:49:50+05:30 IST

ఇకపై అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీస్కూల్‌ అని పిలవాలని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలు కాదు..వైఎస్సార్‌ ప్రీ స్కూల్స్‌

శిశు సంక్షేమాధికారుల సమీక్షలో కలెక్టర్‌ మాధవీలత

బొమ్మూరు, ఆగస్టు 16 : ఇకపై అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీస్కూల్‌ అని పిలవాలని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని  సీడీపీవో, సూపర్‌వైజర్లలను ఆదేశించారు. డేటా 74 శాతమే నమోదవడంపై ప్రశ్నిం చారు. శనివారం నాటికి సమగ్ర సమాచారం నమోదు చేయాలన్నారు.   అలక్ష్యం వహిస్తే సీడీపీవోలే బాధ్యత వహించాలన్నారు. ఫ్రీ స్కూల్‌లో హాజరు  50, 60 శాతం ఉండడంపై ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T06:49:50+05:30 IST