తీరంలో భద్రతా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-19T04:59:32+05:30 IST

జిల్లాలోని సముద్రతీర ప్రాంతం పరిధిలో భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు అదేశించారు.

తీరంలో భద్రతా చర్యలు చేపట్టాలి
నియామకపు పత్రాలు అందచేస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కోస్టల్‌ సెక్యూరిటీ కమిటీ సమీక్షలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 18 : జిల్లాలోని సముద్రతీర ప్రాంతం పరిధిలో భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కోస్టల్‌ సెక్యూరిటీ కమిటీ సమీక్ష జరిగింది. ఆయన మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతంలో ఇతర మత్స్యకారుల దాడులు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. మత్స్యకారుల సంక్షేమంపై ఆరా తీశారు. దుగరాజపట్నం, ఇసుకపల్లి, శ్రీహరికోటలో ఉన్న మెరైన్‌ పోలీస్‌ స్టేషన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జేసీలు హరేందిరప్రసాద్‌, విశాఖపట్నం కోస్టల్‌ సెక్యూరిటీ అదనపు ఎస్పీ విమలకుమారి, జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం,  కష్ణపట్నం పోర్టు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌  మాధురి తదితరులు పాల్గొన్నారు. 


దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు 

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా వివిధ ఉద్యోగాలకు ఎంపికైన దివ్యాంగులకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు సోమవారం నియామక ఉత్తర్వులు అందచేశారు. సంబంధిత శాఖ నోటిఫికేషన్‌ ద్వారా  24 పోస్టులు భర్తీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రోజ్‌మాండ్‌, డీఆర్వో చిన్న ఓబులేసు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ వీ నాగరాజ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:59:32+05:30 IST