Abn logo
Sep 27 2021 @ 23:17PM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధి కారులు అప్రమత్తంగా ఉండా లని, నిరంతరం పర్యవేక్షించా లని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాల యం నుంచి సబ్‌ కలెక్టర్‌ ఆర్డీ వోలతో ఆయన వీడియో సమీ క్ష నిర్వహించారు. సబ్‌ కలెక్ట ర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు తీసుకోవాల్సిన జాగ్రతలపై ఆయన హెచ్చరికలు చేశారు. తీరప్రాంత లోతట్లు గ్రామాలు, ప్రాంతాల అధి కారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రిలీఫ్‌ క్యాంపులు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇళ్లలోకి నీరు వెళ్లినచోట్ల తగు చర్య లు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 233 1077కు ఫోన్‌చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఆయన సూచించారు.


మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు


గులాబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాను కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని సూ చించారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి 95.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, డీఆర్వో డేవిడ్‌ రాజు పాల్గొన్నారు.