ప్రమాద ప్రాంతాల్లో చర్యలేవి..?

ABN , First Publish Date - 2021-04-23T05:38:16+05:30 IST

రహదారి ప్రమాదకరంగా ఉన్న చోట చర్యలేమిటి అంటూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రమాద ప్రాంతాల్లో చర్యలేవి..?
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

రహదారుల భద్రత సమావేశంలో కలెక్టర్‌ అసహనం



ఏలూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రహదారి ప్రమాదకరంగా ఉన్న చోట చర్యలేమిటి అంటూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన జిల్లా రహదారుల భద్రతా సమావేశంలో అధికారులు చేపడుతున్న చర్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రమాదకర ప్రాంతాల్లో చేపట్టిన పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. జిల్లాలో 33 ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించి 6 చోట్ల పూర్తిగా, 5 చోట్ల పాక్షికంగా మాత్రమే పనులు జరగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారుల వెంబడి చెత్త డంపిం గ్‌పై కూడా ఆయన సీరియస్‌ అయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌, డీపీవోలు ఏలూరు నగరంలో డంపింగ్‌ ప్రదేశాలను గుర్తించి, అక్కడ మాత్రమే డంపింగ్‌ జరి గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల మలుపులు, నిర్మాణాలు, మరమ్మతులు జరిగేచోట తప్పనిసరిగా సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మరమ్మతు పనులు వేగంగా పూర్తిచేయాలని చెప్పారు. క్షతగాత్రులను సాధ్యమై నంత త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందంచుకోవాల న్నారు. సమావే శంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:38:16+05:30 IST