గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-19T05:23:41+05:30 IST

గృహ నిర్మాణాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
వీరవాసరంలో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

వీరవాసరం, మే 18: గృహ నిర్మాణాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గృహనిర్మాణాల లే అవు ట్‌లలో మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలన్నారు. మండలంలో 30 లే అవుట్‌ల పరిస్థితిని సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఈఈ బి.వెంకటరమణ మాట్లాడుతూ మండలంలో 34 శాతం ప్రగతి ఉందన్నారు. 1710 ఇళ్లు మంజూరయ్యాయని, 1305 రిజిస్ర్టేషన్‌ చేశారని, 567 గ్రౌండింగ్‌ జరిగాయని, 263 పూర్తి అయ్యాయని తెలిపారు. నెలాఖరకు 50 శాతం లక్ష్యానికి చేరేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. మండల ప్రత్యేకాధికారి దుర్గేష్‌, తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, ఎంపీడీవో పి.శ్యామ్యూల్‌, ఏఈ పిఎస్‌ఆర్‌ ఆంజనేయరాజు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:23:41+05:30 IST