‘దళితబంధు’పై కలెక్టర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-05-21T04:41:53+05:30 IST

దళితబంధు పథకం కింద గ్రౌండ్‌ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలకు అను సంధానం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంక ట్రావు సూచించారు.

‘దళితబంధు’పై కలెక్టర్‌ సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

- గ్రౌండ్‌ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయాలని సూచన


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), మే 20: దళితబంధు పథకం కింద గ్రౌండ్‌ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలకు అను సంధానం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంక ట్రావు సూచించారు. దళితబంధుపై శుక్ర వారం ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వ హించారు. జిల్లాలో దళితబంధు కింద మొదటి విడ త ట్రాన్స్‌పోర్ట్‌, సర్వీసు, ఇండస్ర్టీ, డెయిరీ తదితర రం గాల్లో సుమారు 315 యూనిట్లు మంజూరు చేయ డం జరిగిందని, ఆయా రంగాల్లో గ్రౌండ్‌ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తే లబ్ధిదారుల యూనిట్లు విజయవంతంగా నడవ టమే కాకుండా వారికి ఉపాధి కలుగుతుందని కలె క్టర్‌ అన్నారు. ప్రత్యేకించి సెంట్రింగ్‌ మెటీరియల్‌ను మన ఊరు, మన బడి నిర్మాణాలకు అనుసంధానం చేయాలని, డిజిటల్‌ సర్వే యూనిట్‌ను ప్రభుత్వ సర్వే పనులకు, అలాగే డెయిరీ, ట్రాన్స్‌పోర్ట్‌, సేవల విభాగా లలోని యూనిట్లను కూడా సాధ్యమైనంతవరకు ప్ర భుత్వ పథకాల ద్వారా చేపట్టే కార్యక్రమాలకు అను సంధానం చేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుం దని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆ యా రంగాలకింద ఇప్పటివరకు గ్రౌండ్‌ అయిన యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అద నపు కలెక్టర్‌ కె.సీతారామారావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ యాదయ్య, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌, డీఆర్డీవో యాదయ్య, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి అధికారి వెంకటేశ్‌, ఆర్టీవో నరేశ్‌, ఉద్యా నశాఖ డీడీ సాయిబాబా, పరిశ్రమల శాఖ ప్రతిని ధులు సమావేశానికి హాజరయ్యారు.

 జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంచాలి

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెం పొందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలె క్టర్‌ ఎస్‌.వెంకట్రావు పిలుపునిచ్చారు. ప్రతీ శుక్రవారం మొక్కలకు నీరు పోసే కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న మొక్క లకు నీరు పోశారు. కార్యక్రమంలో డీఎస్‌వో వన జాత, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-05-21T04:41:53+05:30 IST