Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా శశాంక్‌ గోయల్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8: స్థానిక సంస్థ, శాసనమండలి సభ్యుల ఎన్నికలపోలింగ్‌ను పకడ్బం దీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ అన్నారు. బుధవారం హైదరా బాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఈనెల10 జరుగ నున్న స్థానికసంస్థల ఎన్నికల పోలింగ్‌పై సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని అన్నారు. ఈనెల 10నఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4గంటలవరకు పోలింగ్‌ జరుగుతుంద న్నారు. అన్నిపోలింగ్‌ కేంద్రాలలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజికదూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవడం తోపాటు ఆరోగ్య కార్యకర్తలను నియ మించాలన్నారు. గట్టిపోలీసు బందో బస్తు ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్‌ సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌కేంద్రాలకు వెళ్లేటప్పుడు, పోలింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్‌ బాక్సులతో రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చేటప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈనెల 14న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియను సైతం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని జిల్లా ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. పోలీసుశాఖ అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement
Advertisement