18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-26T07:03:19+05:30 IST

పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కేఎ్‌సఆర్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల వరకూ ర్యాలీ చేపట్టారు.

18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

కలెక్టర్‌ గంధం చంద్రుడు... ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

అనంతపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కేఎ్‌సఆర్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గణతంత్రమంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారే దేశాన్ని పరిపాలించే వ్యవస్థ అన్నారు. ఎన్నుకునే అవకాశమిచ్చేది ఓటు హక్కు అన్నారు. అలాంటి దానిపై నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. జేఎన్‌టీయూ వీసీ రంగ జనార్దన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుణగణాలు, పనితీరును అంచనా వేసుకుని, ఓటేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం జిల్లాలో ఓటు నమోదు ప్రక్రియలో ప్రతిభ కనబరచిన బూత్‌లెవల్‌ అధికారులను కలెక్టర్‌, వీసీ, జేసీలు సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పలువురు వృద్ధులను సన్మానించారు. కార్యక్రమం లో జేసీలు నిశాంత్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, డీఆర్వో గాయత్రీదేవి, మున్సిపల్‌ క మిషనర్‌ మూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T07:03:19+05:30 IST