15 నాటికి ‘జల్‌జీవన మిషన’ ప్రారంభం కావాలి

ABN , First Publish Date - 2021-07-25T06:19:21+05:30 IST

జిల్లాలో జల్‌జీవన మిషన కింద చేపడుతున్న పనుల్లో ఇప్పటికీ ప్రారంభంకాని పనులు ఆగస్టు 15 నాటికి మొదలు పెట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో జల్‌జీవన మిషన కింద చేపడుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు.

15 నాటికి ‘జల్‌జీవన మిషన’ ప్రారంభం కావాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

అనంతపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జల్‌జీవన మిషన కింద చేపడుతున్న పనుల్లో ఇప్పటికీ ప్రారంభంకాని పనులు ఆగస్టు 15 నాటికి మొదలు పెట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో జల్‌జీవన మిషన కింద చేపడుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన మిషన కింద 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో జల్‌జీవన మిషన కింద రూ.5 లక్షల్లోపు, 5 లక్షలు పైబడిన మొత్తం పనులు 3267 మంజూరయ్యాయన్నారు. ఇందులో 955 పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించి నెలాఖరులోపు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అర్హత ఉన్న ఏజెన్సీకి పనులు అప్పగించాలన్నారు. ఇప్పటికే జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డీపీఓ పార్వతి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, డీఈఓ శామ్యూల్‌, ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి, డ్వామా ఏపీడీలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాల్సిందే

అనంతపురం వైద్యం: జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని కలెక్టర్‌ నాగలక్షి ఆదేశించారు. జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆమె ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుతున్నా.. అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు జీఓ 57ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమష్టిగా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన పడకలతో సమానంగా ఆక్సిజన సిలిండర్లు ఉండాలన్నారు. 50 పడకలు మించి ఉన్న ఆస్పత్రిలో పీఎ్‌సఏ ఆక్సిజన ప్లాంట్‌, 50 నుంచి 100 పడకల ఆస్పత్రిలో 500 ఎల్‌పీఎం ఆక్సిజన ప్లాంట్‌, వందకుపైన పడకలు ఉన్న వాటిలో వెయ్యి ఎల్‌పీఎం ఆక్సిజన ప్లాంట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి ఆస్పత్రిని నోడల్‌ ఆఫీసర్లు ప్రతి రోజూ సందర్శించాలన్నారు. సమావేశంలో జేసీ డాక్టర్‌ సిరి, డీఎంహెచఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T06:19:21+05:30 IST