సూపర్‌ స్పెషాలిటీలో తాత్కాలిక ఆస్పత్రి

ABN , First Publish Date - 2021-05-18T06:25:07+05:30 IST

జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఆవరణలో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

సూపర్‌ స్పెషాలిటీలో తాత్కాలిక ఆస్పత్రి

300 పడకలతో నిర్మాణం వేగవంతం... పనులు పరిశీలించిన కలెక్టర్‌

అనంతపురం వైద్యం, మే17: జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఆవరణలో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 300 పడకల జర్మన హ్యాంగర్‌ పద్ధతిలో ఈ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం కలెక్టర్‌ గంధం చంద్రుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోగుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ తాత్కాలిక ఆస్పత్రిలో బాధితులకు ఆక్సిజన అందించడమే ముఖ్యమన్నారు. ఆక్సిజన పైప్‌లైన వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆక్సిజన సరఫరాకు మ్యానిఫోల్డ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన సిలిండర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నిరంతరం పనులు సాగాలనీ, రాత్రిపూట అంతరాయం లేకుండా విద్యుత సరఫరా చేయాలని ట్రాన్సకో అధికారులను ఆదేశించారు. తాత్కాలిక ఆస్పత్రి చుట్టూ వర్షం వచ్చినా నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి అవసరమైన నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించారు. మొబైల్‌ టాయిలెట్లు సిద్ధం చేయాలన్నారు. పార్కింగ్‌, హోటళ్ల ఏర్పాటుకు మార్కింగ్‌ వేయాలన్నారు. మందుల సరఫరా విషయంలో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డ్రగ్స్‌ శాఖ ఏడీకి సూచించారు. తాత్కాలిక ఆస్పత్రికి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలని డీఎంహెచఓకు ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నిశాంతకుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్‌కుమార్‌, విద్యుతశాఖ ఎస్‌ఈ వరకుమార్‌, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, నగర కమిషనర్‌ మూర్తి, డ్రగ్స్‌ శాఖ ఏడీ రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T06:25:07+05:30 IST