ప్రజా సహకారం కావాలి

ABN , First Publish Date - 2022-07-04T05:57:28+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటన విజయవంతం చేయాటానికి ప్రజా సహకారం కావాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, డీఐజీ పాల్‌ రాజు కోరారు.

ప్రజా సహకారం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

అన్ని ఏర్పాట్లు సజావుగా చేశాం

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

బందోబస్తుగా 3 వేల మంది పోలీస్‌ బలగాలు 

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌  ప్రశాంతి, డీఐజీ పాల్‌రాజు


భీమవరం, జూలై 3 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటన విజయవంతం చేయాటానికి ప్రజా సహకారం కావాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, డీఐజీ పాల్‌ రాజు కోరారు. ఆదివారం రాత్రి సభావేదిక వద్ద  మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ట్రాఫిక్‌ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పట్టణ ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి ట్రాఫిక్‌ నియంత్రణ విషయంలో సహకరించాల న్నారు. సోమవారం సాయంత్రం వరకు నగరంలో షాపులు మూసి వేయా లని కోరారు. అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించినట్టు కలెక్టర్‌ తెలిపారు. డీఐజీ పాల్‌రాజు మాట్లాడుతూ  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పట్టణంలో పార్కింగ్‌ ప్రదేశాలు గుర్తించామని, ఆయా ప్రదేశాల్లో పార్కింగ్‌ చేసుకుని, సభాస్థలి నిర్ధేశించిన మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.అత్యంత భద్రత వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ డి–జోన్‌ సమీపంలో, ఎన్‌క్లోజర్లలో సెల్‌ఫోన్లు అనుమతించమన్నారు. బందోబస్తుగా 3 వేల మందిని పోలీస్‌ బలగాలు నియమించామన్నారు. సుమారు 60 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

 

Updated Date - 2022-07-04T05:57:28+05:30 IST