జిల్లాలో రెండు వేల కొవిడ్‌ బెడ్స్‌ సిద్ధం

ABN , First Publish Date - 2021-04-22T06:23:26+05:30 IST

కొవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండు వేల బెడ్స్‌ను సిద్ధం చేశామని, ఇప్పటివరకు 471 మంది యాక్టివ్‌ పాజిటివ్‌లు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలో రెండు వేల కొవిడ్‌ బెడ్స్‌ సిద్ధం
అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

నేడు రెండో విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ : అమలాపురంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సమీక్ష

అమలాపురం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండు వేల బెడ్స్‌ను సిద్ధం చేశామని, ఇప్పటివరకు 471 మంది యాక్టివ్‌ పాజిటివ్‌లు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. అమలా పురంలో ఆధునికీకరించిన సబ్‌కలెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాలులో తొలిసారిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 24 శాతం బెడ్స్‌ మాత్రమే ఇప్పుడు వినియోగంలో ఉన్నా యని తెలిపారు. జిల్లాలో తొమ్మిది ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడంతోపాటు అమలాపురంలోని కిమ్స్‌, రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌, కాకినాడలోని జీజీహెచ్‌ ఆసుప త్రుల ద్వారా కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు. కిమ్స్‌లో 250 ఆక్సిజన్‌ బెడ్స్‌తోపాటు 350 నాన్‌ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా రెండు వేల బెడ్స్‌ అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 471 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 23.96 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ జరిగిందన్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగు దలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్‌ బెడ్స్‌ను రెట్టింపు చేశారు. రెండు మూడు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్‌ నిల్వలపై ప్రతి ఆరు గంటలకు ఒకసారి సమీక్షిస్తు న్నామని చెప్పారు. కాకినాడ జీజీహెచ్‌, అమలాపురం కిమ్స్‌లలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్‌ను ప్లాం టు ద్వారా ఉత్పత్తి చేస్తారని, రాజమహేంద్రవరంలో 16 కిలో లీటర్ల ఆక్సిజన్‌తోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో 71 కిలో లీటర్ల ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొవిడ్‌ ఆసు పత్రుల్లో 18 నుంచి 20 కిలో లీటర్ల మేర ఆక్సిజన్‌ సరఫరా అవసరం అవుతుందన్నారు. కొవిడ్‌ వ్యాధి లక్షణాలు ఉన్నవారి ఆరోగ్య స్థితిగతులను బట్టి ఆయా ఆసుపత్రుల్లో బాధితులను అడ్మిట్‌ చేసుకుంటారన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు పంపిణీ చేసి వైద్య సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. రోగుల కండిషన్‌ను బట్టి వారిని వివిధ ఆసుపత్రులకు తరలించేందుకు తొమ్మిది అంబులెన్సులను సిద్ధంచేశామని తెలిపారు. కొవిడ్‌ వల్ల ఎటువంటి పరి స్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నదఽ్ధమై ఉందని కలెక్టర్‌ తెలిపారు


నేడు రెండో డోస్‌ టీకా పంపిణీ మాత్రమే..


జిల్లావ్యాప్తంగా గురువారం అన్ని పీహెచ్‌సీలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రెండో డోస్‌ పెండింగ్‌ ఉన్నవారికి మాత్రమే కొవిడ్‌ టీకాల పంపిణీ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి వెల్లడించారు. రెండో డోస్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ టీకా పంపిణీ జరుగుతుందని, మొదటి డోస్‌ మాత్రం ఇవ్వడం జరగదన్నారు. కొవిడ్‌ బాధితులు హోంఐసోలేషన్‌లో ఉండి పరిస్థితి విషమించిన తర్వాత అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, స్థానిక మెడికల్‌ సిబ్బంది ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని పీహెచ్‌సీ డాక్టర్ల వద్దకు తీసుకువెళితే వారిని కొవిడ్‌ ఆసుపత్రికి తరలిస్తారన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులను వలంటీర్లు, హెల్త్‌ వర్కర్లు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు పల్స్‌ ఆక్సిలేటర్‌తో ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పరీక్షించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో అమలాపురం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, ట్రైనీ కలెక్టర్‌ గీతాంజలిశర్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T06:23:26+05:30 IST