జర్నలిస్టులకు ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2020-08-07T11:26:33+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేప థ్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యసేవలు అందేలా ..

జర్నలిస్టులకు ప్రత్యేక కమిటీ

పర్యవేక్షణలో వైద్యసేవలు : కలెక్టర్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 6: జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేప థ్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ఇ ందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుకు ఉత్తర్వుల ను కూడా ఇస్తామని చెప్పారు. గురవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్‌ భాస్కర్‌ను కలిశారు ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు మా ట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలతో వైద్యం అందించాలన్నా రు.


అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు కరోనా టెస్టులు చే యించుకునేందుకు పాత రిమ్స్‌ ఆవరణలో ఒక ప్రత్యేక వాహనాన్ని ఏ ర్పాటు చేస్తామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అం దించడంతో పాటు, పూర్తిగా కోలుకునే వరకు వారి బాధ్యతను ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ఉషాకిరణ్‌ కుటుంబానికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవరెడ్డి,  కనకయ్య,  శ్రీనివాసులు, విస్సా శ్రీను, బొడ్డు శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T11:26:33+05:30 IST