Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవ్వాలి

మండలాధికారులతో కలెక్టర్‌ నివాస్‌ 

వన్‌టౌన్‌, డిసెంబరు 3 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయశాఖ అధికారులతో చెప్పారు. స్థానిక క్యాంప్‌ కార్యాలయం నుంచి శుక్రవారం ధాన్యం కొనుగోలుపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి మండల స్థాయిలో అఽఽధికారులు ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని సూచించారు. జిల్లాలోని 734 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలన్నారు. ఇందుకు 1.3 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయన్నారు. ఒక్కో గోనెసంచికి రూ.7 ఇస్తున్నామని, గోనె సంచి ఇవ్వకపోతే మొత్తం చెల్లించబోమని స్పష్టం చేయాలన్నారు. మండలాధికారులు, వ్యవసాయ అఽధికారులు, అసిస్టెంట్లు, రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. రవాణా, హమాలీ ఛార్జీలు, గోనెసంచుల వంటివాటిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. సొసైటీలు ధాన్యం కొనుగోలు చేస్తే ఆ మొత్తాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. 85 శాతం ఈకేవైసీ మేరకు పూర్తయిందని, ఈకేవైసీ లేని రైతులు పంట నష్టం కోల్పోతే ఎటువంటి రాయితీలు ఇవ్వలేమన్నారు. ఓటీఎస్‌, వ్యాక్సినేషన్‌, క్లాప్‌మిత్ర, పాలవెల్లువ గురించి పలు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) మాధవీలత, జేసీ (ఆసరా) కె మోహనకుమార్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement