డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న కలెక్టర్
వలంటీర్లకు కలెక్టర్ ప్రశాంతి సూచన
పాలకోడేరు, మే 25 : చెత్త సేకరణలో పంచాయతీలపైనే కాకుండా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నప్పుడే గ్రామాలు పరి శుభ్రంగా ఉంటాయని జిల్లా కలె క్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. పాల కోడేరులో డంపింగ్ యార్డును బుధవారం పరిశీలించిన ఆమె రెవెన్యూ, పంచాయతీ, సచివా లయ, వలంటీర్లకు ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణపై అవగా హన కల్పించారు. డంపింగ్ యార్డుల ద్వారా ఆదాయ వనరులను కల్పించడమే కాకుండా గ్రామంలో చెత్త సేకరించడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ప్రతీ వలంటీర్ తనకు ఇచ్చిన 50 ఇళ్లు తిరిగి చెత్త సేకరణపై పొడి చెత్త, తడిచెత్తను ఏ విధంగా వేరు చేయాలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీరు నిల్వ లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని సూచించారు. డీఎల్పీవో నాగలత, తహశీల్దార్ మధుసూదనరావు, ఎంపీడీవో వెంకటఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.