ఎమ్మెల్సీ ఎన్నికలలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాలి..

ABN , First Publish Date - 2021-03-02T06:18:30+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు తమ ఫొటో ఓటరు గుర్తింపు(ఎపిక్‌)కార్డును ప్రిసైడింగ్‌ అధికారికి తప్పనిసరిగా చూపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాలి..

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి 1: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు తమ ఫొటో ఓటరు గుర్తింపు(ఎపిక్‌)కార్డును ప్రిసైడింగ్‌ అధికారికి తప్పనిసరిగా చూపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఫొటో ఓటరు గుర్తింపు కార్డు లేని ఓటర్లు ఎన్నికల కమిషన్‌ అనుమతించిన తొమ్మిడి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి చూపవచ్చని తెలియజేశారు. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్టు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వారి సంస్థ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ అయిన అఫిషియల్‌ ఐడెంటిటీ కార్డులు, నియోజకవర్గ పరిధిలోని విద్యాసంస్థలలో పనిచేస్తున్న సర్వీసు ఐడెంటిటీ కార్డు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ, డిప్లమో ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, అర్హత కలిగిన అఽథారిటీ ద్వారా జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌ చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-03-02T06:18:30+05:30 IST