రహదారి భద్రత అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-05-28T06:28:09+05:30 IST

రహదారి భద్రత అందరి భద్రత అని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వై. ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు.

రహదారి భద్రత అందరి బాధ్యత
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఏలూరు కలెక్టరేట్‌, మే 27 : రహదారి భద్రత అందరి భద్రత అని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వై. ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్ట రేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రవాణా, పోలీస్‌ జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులకు సూచనలు చేశారు. 1033 హెల్ప్‌లైన్‌ (ఎమర్జెన్సీ అంబులెన్స్‌)పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాల్లో వెంటనే స్పందించి ఆదుకునే వారికి రూ.ఐదు వేలు పారితోషకం అందించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. జేసీ అరుణ్‌బాబు, ఉపరవాణా కమీషనర్‌ సిరి, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ ఎంవి నిర్మల, పిఆర్‌ఎస్‌ఇ చంద్రభాస్కరరెడ్డి, డీటీసీ డీఎస్పీ కె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘స్పందన’ పర్యవేక్షణకు అధికారుల నియామకం 

రెవెన్యూ స్పందన దరఖాస్తుల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో అధికారులను నియమించినట్టు కలెక్టర్‌ తెలిపారు.  ఏలూరు నియోజకవర్గానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, దెందులూ రుకు డీఆర్వో, ఉంగుటూరు, గోపాలపురంలకు, ఏలూరు జిల్లా మండలాల కు ఏలూరు ఆర్డీవోను, నూజివీడుకు నూజివీడు ఆర్డీవోను, చింతల పూడికి భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను, పోలవరానికి జంగారెడ్డిగూడెం ఆర్డీవోను, కైకలూరుకు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నియామకం. 

జిల్లాలో గత నాలుగేళ్ల కాలంలో అనుమతించిన చేపలు, రొయ్యల చెరు వులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఆయన సమీక్షించారు. పర్యావరణానికి, పంట పొలాలకు హాని కలగని రీతిలో ఉన్న చేపలు, రొయ్యల చెరువులకు అనుమతి మంజూరు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులపై నివేదిక సమర్పించాలన్నారు. 

గోడౌన్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఏలూరు కలెక్టరేట్‌, మే 27 : జిల్లాలో బహుళార్ధక వినియోగ గోడౌన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వై. ప్రసన్న వెంకటేష్‌ సహకార అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశంలో జిల్లాలో గోడౌన్ల నిర్మాణ పనులపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో మల్టీపర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ పథకం కింద ఆర్బీకేల వద్ద మొదటి దశలో 76 గోడౌన్లు నిర్మిస్తామన్నారు. మరో 44 గోడౌన్లకు సంబంధించి స్థల సేకరణ సమస్యలను తహసీల్దార్‌, ఆర్డీవో సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మంచినీటి సౌకర్యాలకు చర్యలు చేపట్టాలి..

ఏలూరు రూరల్‌, మే 27 : ఇళ్ల స్థలాల లేఅవుట్‌ల వాసులకు తాగునీరు సౌకర్యం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో చొదిమెళ్ళ, పోణంగి ప్రాంతాల్లోని ఇళ్ల లే–అవు ట్‌లలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ లే–అవుట్‌ వాసులతో పాటు విలీన ఏడు గ్రామాల ప్రజలకు తాగునీరు సౌకర్యానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అడవి కొత్తచెరువును పరిశీలించిన కలెక్టర్‌ అమృత్‌ సరోవర్‌లో ఈ చెరువు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. పోణంగిలోని 94 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువును పరిశీలించారు. 

Updated Date - 2022-05-28T06:28:09+05:30 IST