అభివృద్ధి పనులు వేగం చేయండి

ABN , First Publish Date - 2022-01-22T04:07:46+05:30 IST

జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవం తం చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగం చేయండి

కమిషనర్లను ఆదేశించిన కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 21: జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవం తం చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరం నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, డీఈ ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్‌ అధి కారులు, పారశుధ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్ర వరి 1వ తేదీ నుంచి అన్ని మున్సిపాల్టీల్లో ప్రతి ఇంటి నుం చి నూరుశాతం చెత్తసేకరణ జరిగేలా చర్యలు తీసుకో వాలన్నారు. చెత్త సేకరణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యమైన అంశమన్నారు. చెత్త సేకరణ  ప్రక్రియ ఏ విధంగా జరగు తున్నదని మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకొన్నారు. కొత్తగూడెంలో 67శాతం, ఇల్లెందులో 95శాతం, పాల్వం చలో 76శాతం, మణుగూరులో 40శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగుతున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి డీఆర్‌సీసీలో చెత్త వేరుచేయు ప్రక్రియ  ప్రారంభించా లన్నారు. వార్డులవారీగా చెత్తను వర్మి తయారు చేయు టకు టెట్రా వర్మి బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. చెత్త సేకరణ తక్కువగా జరుగుతున్న వార్డులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, కౌన్సిలర్లను భాగస్వాముల్ని చేయాలన్నారు. కొత్తగూడెం పట్టణంలోని పంచతంత్ర, రాజీవ్‌పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మున్సిపాల్టీల్లో పారశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, మొక్కల సంరక్షణకు నిరంతరం జరగాలన్నారు. అవెన్యూ ప్లాంట్‌ కేర్‌ను కొన సాగించి మొక్కల సంరక్షణ చేపట్టాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా సెప్టిక్‌ ట్యాం కులను జియో ట్యాగింగ్‌ చేయాల న్నారు. సెప్టిక్‌ ట్యాంకులు జియో ట్యాగింగ్‌ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేసిన మున్సిపల్‌ కమీషనర్‌ను, సిబ్బందిని అభి నందించారు. పారిశుధ్య కార్మికుల కు సకాలంలో వేతనాలు చెల్లించా లని, ఈపీఎఫ్‌ మినహాయింపులు చేయాలని, ఈపీఎఫ్‌ నెంబర్లు కేటాయించాలని, అట్టి వివ రాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆన్‌ ఆర్గ నైజ్డ్‌ సిబ్బంది వివరాలు ఈ శ్రమ పోర్టర్‌లో అప్‌లోడ్‌ చే యాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను ము న్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకొన్నరు. పనులను వేగవంతం చేయాలని, జాప్యం చేసే కాంట్రాక్టర్లు అవసరం లేదని, వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. మున్సిపాల్టీల్లో గ్యాస్‌ బేస్‌డ్‌ క్రిమటోరియాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటి ఏర్పాటు వల్ల అంతిమ కార్యక్రమాల నిర్వాహాణకు కట్టెల కోసం చెట్లను కొట్టాల్సిన అవసరం ఉండదన్నారు. వె ౖకుంఠ ధామాల్లో నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం ఉండాలని సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. మణుగూరు మున్సిపాల్టీలో కమలాపురం, చిన్నరావిగూడెంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజారో గ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారులు మున్సిపల్‌ కమిషనర్లు, సంపత్‌ కుమార్‌, శ్రీకాంత్‌, అంజన్‌ కుమార్‌, నాగప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T04:07:46+05:30 IST