కలెక్టర్‌.. ఇళ్ల స్థలాల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-05T07:01:44+05:30 IST

సామర్లకోట పట్టణ శివారు విస్తరణ శిక్షణా కేంద్రం వెనుక పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించిన 44.5 ఎకరాల స్థలాలను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు.

కలెక్టర్‌.. ఇళ్ల స్థలాల పరిశీలన
ఇళ్ల స్థలాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

సామర్లకోట, డిసెంబరు 4: సామర్లకోట పట్టణ శివారు విస్తరణ శిక్షణా కేంద్రం వెనుక పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించిన 44.5 ఎకరాల స్థలాలను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలో తొమ్మిది బ్లాక్‌లుగా 5200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి జాబితాలు సిద్ధం చేశామని అధికారులు ఆయనకు వివరించారు. మొదటి దశలో 2444 మందికి ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. లబ్ధిదారునికి మంజూరైన స్థలాన్ని చూపించే మ్యాచింగ్‌, బ్యాచింగ్‌ ప్రక్రియను, జియోట్యాగింగ్‌ పనులను ఈ నెల 10 లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లే అవుట్‌ ప్రక్రియ పూర్తి చేయడంలో స్థానిక అధికారుల కృషిని కలెక్టర్‌ ప్రశంసించారు. కలెక్టర్‌ వెంట కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.ఏసుబాబు, గృహనిర్మాణ డీఈ ఆర్‌ఎస్‌కె.రాజు, ఏఈ ఎల్‌.శ్రీనివాసు, టీపీఎస్‌ మంజల, డీఈ చదలవాడ రామారావు, సర్వేయర్‌ అప్పారావు ఉన్నారు.

Updated Date - 2020-12-05T07:01:44+05:30 IST