ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-09-29T05:28:51+05:30 IST

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం సమగ్రంగా చేయాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ బీఎల్‌ఓలను ఆదేశించారు.

ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయాలి

బీఎల్‌ఓలకు కలెక్టర్‌ ఆదేశం

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 28: ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం సమగ్రంగా చేయాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ బీఎల్‌ఓలను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఓటరు అనుసంధానం చేస్తుండటంతో టీడీపీ నాయకులు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం మండలంలోని గుట్టూరులోని 176 పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు అనుసంధాన ప్రక్రియపై ఎంతవరకు పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. వలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో పాల్గొనకూడదని సూచించారు. గరుడ యాప్‌ ద్వారా వీలైనంత త్వరగా ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. 



Updated Date - 2022-09-29T05:28:51+05:30 IST