ఆత్మకూరులో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన Collector
ABN , First Publish Date - 2022-06-22T18:54:22+05:30 IST
ఆత్మకూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ చక్రధరబాబు బుధవారం పరిశీలించారు.
నెల్లూరు: ఆత్మకూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ చక్రధరబాబు(Chakardhar babu) బుధవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని... కోవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకొంటున్నామన్నారు. ప్రతీ బూత్ వద్ద మెడికల్ టీం ఉంటుందని చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ చక్రధరబాబు కోరారు.