దాతలు దాతృత్వాన్ని చాటుకోవాలి

ABN , First Publish Date - 2020-03-29T09:25:55+05:30 IST

కరోనా వైరస్‌ తీవ్రమవుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థి తుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ దాతృ త్వాన్ని చాటుకోవాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు.

దాతలు దాతృత్వాన్ని చాటుకోవాలి

కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి 


విజయవాడ సిటీ, మార్చి 28: కరోనా వైరస్‌ తీవ్రమవుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థి తుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ దాతృ త్వాన్ని చాటుకోవాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో దాతల నుంచి విరాళాల సేకరణపై శనివారం అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వా మ్యం లేనిదే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేమన్నారు. ఇటీవల ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అందించిన మా స్క్‌లు, శానిటైజర్లను ప్రజలకు, ప్రభుత్వ అధికా రులు, సిబ్బంది, పోలీస్‌లు, డాక్టర్లకు ఉచితంగా అందించామన్నారు.


దాతలు నగదు, వస్తు, నిత్యా వసర సరుకుల రూపేణా విరాళాలు అందించ వచ్చన్నారు. ఈవిరాళాలను కలెక్టర్‌, లేదా చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ పేరు మీద చెక్‌ లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో అందించవచ్చన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, కూరగాయలు, నిత్యావస రాలను సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా అందించవ చ్చన్నారు. ఈ సమావేశంలో జేసీ కే.మాధవీలత, వీఎంసీ కమిషనర్‌ వీ.ప్రసన్న వెంకటేష్‌, జేసీ-2 మోహన్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్‌, పలువురు వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


చిత్తశుద్దితో విధులు నిర్వర్తించండి

నగరంలోని హోమ్‌ ఐసోలేషన్‌లోని వారి ఆరో గ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ జూనియర్‌ డాక్టర్లకు సూచిం చారు. నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియం త్రణపై జూనియర్‌ డాక్టర్లకు క్యాంపు కార్యాల యంలో కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. ఈసంద ర్బంగా ఆయన మాట్లాడుతూ జూనియర్‌ డాక్టర్ల తో 41 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీలో ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు, ఏఎన్‌ ఎం, ఆశా వర్కర్లు ఉంటారన్నారు.


వీరు ఎన్నారై లు, వారి కుటుంబ సభ్యులు ఏప్రిల్‌ 14వరకు పూర్తిగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేలా చూస్తా రని, వారి ఆరోగ్య పరిస్థతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నివేదికలు అందిస్తుంటారన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ పాటించని వారి వివరాలను వైద్యాధికారి, రెవెన్యూ లేదా పోలీసులకు తెలపాల న్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ అనుపమ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమేష్‌, డీసీ హెచ్‌ఎస్‌ డాక్టర్‌ జ్యోతిర్మయి, పలువురు జూనియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు.                            


పాత్రికేయులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి

వన్‌టౌన్‌ : పాత్రికేయులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవా లని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు మాస్క్‌లు, శానిటైజర్‌లను కలెక్టర్‌ అందచేశారు. మిగిలిన పాత్రికేయులకు ఆదివారం అందచేస్తామని తెలి పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, డాక్టర్‌, వైద్యసిబ్బంది, పోలీసులతోపాటు పాత్రికేయులు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో తమ విధులను నిర్వర్తిస్తున్నారన్నారు. 


Updated Date - 2020-03-29T09:25:55+05:30 IST