నగరంలో ఆక్రమణలు వెంటనే తొలగించాలి

ABN , First Publish Date - 2020-10-23T11:44:25+05:30 IST

నగర సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్ల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

నగరంలో ఆక్రమణలు వెంటనే తొలగించాలి

 అధికారులకు కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదేశాలు


కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 22: నగర సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్ల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరాభివృద్ధి సుందరీకరణ పనుల్లో భాగంగా జేసీ సాయికాంత్‌ వర్మ, సబ్‌కలెక్టర్‌ పృఽథ్వీతేజ్‌, నగరపాలక కమిషనరు లవన్నలతో కలసి కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు కూడళ్లను, రోడ్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా ఇరుకు రోడ్లతో ప్రజలు సతమతమవుతున్నారని, ఇప్పటికే నగరాభివృద్ధి ప్రణాళికలను కూడా సిద్ధం చేసి అన్ని రకాలుగా నగరాన్ని అభివృద్ధి చేయనున్నామన్నారు. కార్యక్రమంలో కడప తహసీల్దారు శివరామిరెడ్డి, ఈఈలు ధనలక్ష్మీ, భాస్కర్‌రావు, టీపీఓ క్రిష్ణసింగ్‌, సర్వేయర్‌ జోసెఫ్‌, సంబంధిత మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:44:25+05:30 IST