లక్ష్యాలు చేరుకోకుంటే ఎలా?

ABN , First Publish Date - 2020-09-25T10:52:45+05:30 IST

ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే ఎలా అంటూ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రశ్నించారు.

లక్ష్యాలు చేరుకోకుంటే ఎలా?

తక్కువగా మొక్కలు నాటిన వారిపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆగ్రహం


కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 : ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే ఎలా అంటూ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రశ్నించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా తక్కువగా మొక్కలు నాటిన వారిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలవారీగా ఇచ్చిన లక్ష్యాల్లో కొన్ని శాఖలు కనీస స్థాయిలో కూడా మొక్కలు నాటకపోవడంపై మండిపడ్డారు. వెంటనే లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించారు. నాటిన మొక్కలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మొక్కలు నాటడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, దీనిని నిలబెట్టుకోవడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో సామాజిక అటవీ అధికారి జానకీరావు, జిల్లా వైద్యాధికారి రమణకుమారి, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, గృహ నిర్మాణ శాఖ పీడీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T10:52:45+05:30 IST