వరద పరిస్థితిని చూడడానికి రోడ్డుపైకి వచ్చిన కలెక్టర్.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-17T21:48:40+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాలు, నగరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి..

వరద పరిస్థితిని చూడడానికి రోడ్డుపైకి వచ్చిన కలెక్టర్.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాలు, నగరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి.. నిలువ నీడ లేక లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లా కలెక్టర్ రుక్మిణి రియర్ కారులో బయల్దేరారు.. నగరంలోని ఓ ప్రాంతంలో ఆమె కారు నాలుగు అడుగుల లోతులో మునిగిపోయింది.. స్థానికులు ఆమెను, ఇతర సిబ్బందిని కాపాడారు. 


ఇది కూడా చదవండి..

తల్లిదండ్రుల మీద కోపంతో ఇంటి నుంచి పారిపోయిన 14 ఏళ్ల బాలిక.. 20 రోజుల పాటు ఆమె ఎంతటి నరకం అనుభవించిందంటే..


గత మూడు రోజులుగా శ్రీగంగానగర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం మొత్తం జలమయం కావడంతో జిల్లా యంత్రాంగంతో పాటు ఆర్మీ బృందాలు కూడా ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం బొలెరోలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ రుక్మిణి రియర్ వరద నీటిలో చిక్కుకుపోయారు. నగరంలోని మల్టీ పర్పస్ స్కూల్ సమీపంలోని అండర్ బ్రిడ్జి కింద చేరిన నీటిలో ఆ వాహనం చిక్కుకుపోయింది. అండర్ బ్రిడ్జి వైపు వెళ్లవద్దని స్థానికులు కలెక్టర్‌ను హెచ్చరించారు. అయినా ఆమె మాట వినకుండా ముందుకు వెళ్లారు. అండర్‌బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే వాహనంలోకి నీరు చేరింది. 


నీటిలో చిక్కుకుని ఆగిపోయిన వాహనంలో ఉన్న కలెక్టర్‌ను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు వ్యక్తులు నీటిలోకి దిగి కారును ముందుకు తోశారు. చాలా ప్రయత్నం తర్వాత కారు నీళ్లలోంచి బయటకు వచ్చి అవతలి ఒడ్డుకు చేరుకుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2022-07-17T21:48:40+05:30 IST