కూరగాయల సాగుతో అధిక లాభాలు: కలెక్టర్‌ గౌతమ్‌

ABN , First Publish Date - 2020-05-28T11:15:14+05:30 IST

రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు.

కూరగాయల సాగుతో అధిక లాభాలు: కలెక్టర్‌ గౌతమ్‌

మహబూబాబాద్‌ రూరల్‌, మే 27 : రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మహబూబాబా ద్‌ శివారు అనంతారం గ్రామంలో బుధవారం పంట ల ప్రణాళిక-వానకాలం 2020 రైతు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రైతులను బలోపేతం చేసేందుకు సమగ్ర పంట ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. వానకాలంలో మొక్కజొన్న పంట వే స్తే నష్టాలు వస్తాయని, పత్తి, కంది పంటలు వేసుకోవాలని సూచించారు.


మన జిల్లాలో మిర్చిపంటకు అధిక ధర లభిస్తుందని, అయిల్‌ఫామ్‌ తోటలకు ప్ర భుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ కోడి నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్‌, ఉద్యావనశాఖ అధికారి సూర్యనారాయణ, తేళ్ల శ్రీను, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బూర్ల ప్రభాకర్‌గౌడ్‌, శేషారెడ్డి, తహసీల్దార్‌ రంజిత్‌, ఏవో తిరుపతిరెడ్డి, ఏఈవో పూజిత, రైతులు పాల్గొన్నారు. 


నెల్లికుదురు మండలంలోని బ్రహ్మణపల్లి, కొత్తపల్లి, పార్వతమ్మగూడెం, మునిగలవీడు, ఆలేరు గ్రామాల్లో జరిగిన సదస్సులో జిల్లా రైతు బందు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ బాలాజీనాయక్‌, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 


తొర్రూరు మండలంలోని హరిపిరాల, గోపాలగి రి, జీకే తండాలో జరిగిన సదస్సులో ఎంపీపీ అం జయ్య, జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పెద్దవంగర మండలంలోని చిన్నవంగర, పోచారం గ్రా మాల్లో జరిగిన సదస్సులో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి పాల్గొన్నారు. గార్ల మండలం పోచారం గ్రామంలో జరిగిన సదస్సులో సర్పంచ్‌ మో తీలాల్‌, ఏవో రామారావు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T11:15:14+05:30 IST