‘రోగం లేకున్నా చికిత్స’పై కలెక్టర్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2022-06-28T07:03:21+05:30 IST

ఇక్కడ రోగం లేకున్నా చికిత్స... ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం కక్కుర్తి అనే కథనంపై జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సీరియస్‌గా స్పందిం చారు.

‘రోగం లేకున్నా చికిత్స’పై కలెక్టర్‌ సీరియస్‌


ఆ ప్రైవేట్‌ ఆస్పత్రికి నోటీసులు 


అనంతపురం టౌన జూన 27 : ఇక్కడ రోగం లేకున్నా చికిత్స... ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం కక్కుర్తి అనే కథనంపై జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సీరియస్‌గా స్పందిం చారు. దీనిపై విచారణ జరిపి నివేదికలు అందజేయాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ డీసీ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలోని ఆ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్ళి విచారణ జరిపారు. ఆ సమయంలో ఆ ఆస్పత్రి యాజమాన్యం తప్పించు కొనేందుకు ఏవో కారణాలు తెలిపినట్లు డీసీ తెలిపారు. ఆ కారణాలు సరిపోకపోవడంతో నోటీసులు ఇచ్చివచ్చినట్లు  తెలిపారు. రాత పూర్వకంగా సంజాయిషీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి  చర్యలు తీసుకుంటా మన్నారు. గతంలోనూ ఇదే ఆస్పత్రికి రూ4.50 లక్షలు జరిమానా విధించినట్లు  తెలిపారు. 

Updated Date - 2022-06-28T07:03:21+05:30 IST