ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-05-21T05:52:01+05:30 IST

జగనన్న కాలనీల లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్‌ అసంతృప్తి

కల్లూరు, మే 20: జగనన్న కాలనీల లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ మేరకు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు వెనుకబడి ఉండడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో జీవీ రమణమూర్తి, తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌, కేడీసీసీ డైరెక్టర్‌ కల్ల వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ కృష్ణ ఉన్నారు.

Updated Date - 2022-05-21T05:52:01+05:30 IST