Abn logo
Apr 11 2021 @ 11:06AM

ఆదోని, గోరుకల్లులో డయేరియా ఘటనపై కలెక్టర్ సీరియస్

కర్నూలు: ఆదోని, గోరుకల్లులో డయేరియా ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పాణ్యం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ విజయభాస్కర్‌ను సస్పెన్షన్‌ వేటు వేశారు. పాణ్యం ఈవోఆర్ భాస్కర్‌రావు, పాణ్యం ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమాకాంతరెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గోరుకల్లు గ్రామంలో డయేరియా ఘటనపై త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియామించారు. 


గోరుకల్లులో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలకు భయపడి గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటికి దాదాపు 30 కుటుంబాలు ఇళ్లను వదలి వెళ్లాయి. గ్రామంలో అతిసార తగ్గుముఖం పడుతున్నా స్థానికుల్లో భయాందోళనలు తొలగిపోవడం లేదు. దీనికితోడు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి రావచ్చనే అభిప్రాయంతో చాలా మంది ఊరు వదిలి వెళుతున్నారు. గోరుకల్లువాసులు పలువురు నంద్యాల, రుద్రవరం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
Advertisement