సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్
నెల్లూరు(సిటీ), మే 24 : డివిజన్లలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎలా జరుగుతుంది....? అంటూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులోని 35వ డివిజన్ లేక్‌వ్యూ కాలనీ, గౌతమినగర్ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు ప్రభుత్వం జరుగుతున్న తీరును ఆరా తీశారు. వలంటీర్లు ప్రజల్లో ఉంటున్నారా...? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సచివాలయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై తక్షణం స్పందించాలని తెలిపారు కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ వాసంతి, రూరల్ తహసీల్దారు షఫీమాలిక్, ఎన్ఎంసీ నుంచి టీపీవో నాగేశ్వరరావులు పాల్గొన్నారు.